Oct 07,2023 23:55

ప్రజశక్తి - చీరాల 
విజయగనకాలనీ ఉమ్మడి భూమిగా ఉన్న 62ఎకరాలను కాలనీలో మిగిలిపోయిన లబ్దిదారులకు పంపిణీ చేయాలని ఎంఎల్‌ఎ కరణం బలరామకృష్ణమూర్తిని శనివారం ఆయన నివాసంలో విజయనగర కాలనీవాసులు కలిసి వినతి పత్రం అందజేశారు. కారంచేడు ఘటనలో బాదిత కుటుంబాలకు ప్రభుత్వం అందించిన భూములు అన్యక్రాంతం అవుతున్నాయని ఎంఎల్‌ఎ దృష్టికి తెచ్చారు. తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ భూమిని బాధితు కుటుంబాలకు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. కారంచేడు ఘటనలో అప్పటి ప్రభుత్వం బాధితులుకు ఉద్యోగం, ఇంటి నిర్మాణలతో పాటు ఉమ్మడి భూమిని రామాపురం వద్ద సుమారు 62ఎకరాలు అందచేసింది అన్నారు. అయితే తమ భూములలో ఇసుక అక్రమ త్రవ్వ కాలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి కాలనీలో కొందరి సహకారిస్తూన్నట్లు తెలిపారు. భూ సర్వేలు జరుగుతున్నాయని, కొందరు స్థలాలను ఆక్రమించుకుంటున్నట్లు కాలనిలో ప్రచారం జరుగుతోందని తెలిపారు. కావున తమ భూములను అసలైన బాధితులకు పంపిణీ చేయాలని కోరారు.