ప్రజాశక్తి-ఆలూరు
భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మికునికీ మూడెకరాల భూమిని ప్రభుత్వం ఇవ్వాలని ఎపి వ్యకాస (బికెఎంయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ కోరారు. సోమవారం ఆలూరులోని ఉమా ఫంక్షన్ హాలులో 21వ ఎపి వ్యకాస జిల్లా మహాసభలు నిర్వహించారు. ముందుగా మహాసభ ఆవరణలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి బికెఎంయు జెండాను ఆవిష్కరించారు. వ్యకాస జిల్లా అధ్యక్షులు కృష్ణ, సహాయ కార్యదర్శి భూపేష్ అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి నబిరసూల్, వ్యకాస (సిపిఎం) జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడారు. ఈనెల 25, 26, 27న బాపట్లలో వ్యకాస రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. 35 మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా జె.కష్ణ, ఎం.నబి రసూల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.భూపేష్, ఉపాధ్యక్షులుగా కె.మద్దిలేటి శెట్టి, సి.రాజశేఖర్, వి.నాగరాజు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.భాస్కర్ యాదవ్, కార్యదర్శిగా సోమేశ్వర్ రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, బి.సులోచనమ్మను ఎన్నుకున్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటి శెట్టి, మండల కార్యదర్శులు విరుపాక్షి, రామాంజనేయులు, కల్లుబావి రాజు, బికెఎంయు తాలూకా కార్యదర్శి వి.రంగన్న, ఆలూరు సిద్ధేశ్వర కాలనీ శాఖ కార్యదర్శి నరసింహులు, బాషా, ఎఐటియుసి నాయకులు శివ పాల్గొన్నారు.
బికెఎంయు జిల్లా మహాసభలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్










