
ప్రజాశక్తి-ఘంటసాల : రైతులకు భూమిపై శాశ్వత హక్కు కల్పించిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుందని ఎంపీపీ వేమూరి రజని కుమారి తెలిపారు. ఆదివారం ఘంటసాల తాసిల్దార్ కార్యాలయం వద్ద యండకుదురు, బిరుదుగడ్డ గ్రామాలకు చెందిన 250 మంది రైతులకు వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పధకం పత్రాలను ఎంపీపీ, ఏఎంసీ చైర్మెన్ వేమూరి వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వేమూరి వెంకట్రావు మాట్లాడుతూ రైతులుకు కలిగిన సొంత భూమిపై హక్కు కలగజేసేలా జగనన్న శాశ్వత భూహక్కు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. తహసీల్దార్ బి.రామానాయక్ మాట్లాడుతూ శాశ్వత భూహక్కు పథకం మరియు భూ రక్ష పధకం ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాలిపర్రు సర్పంచ్ డి.శాంతకుమారి, సచివాలయ మండల కన్వీనర్ వేమూరి ప్రవీణ్, రీ సర్వే డిటి శ్రీనివాస్, వీఆర్వోలు కర్రా నాగరాజు, నాగేశ్వరరావు, విలేజ్ సర్వేయర్ మానస తదితరులు పాల్గొన్నారు.