Sep 21,2023 21:05

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

     పుట్టపర్తి క్రైమ్‌ : జిల్లాలో రీసర్వే కింద భూ హక్కు పత్రాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌బాబు తెలిపారు. గురువారం నాడు విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి రీ సర్వేకి సంబంధించిన అంశాలపై భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 31 నాటికి రీ సర్వే పూర్తి చేసి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేసి, తుది ఆర్వోఆర్‌ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ అరుణ్‌ బాబు మాట్లాడుతూ ఫేస్‌-2 కింద పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాలు శనివారం నాటికి పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, డిఆర్‌ఒ కొండయ్య, సర్వే అధికారి రామకృష్ణ, జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు.