Oct 20,2022 23:14

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న వైసిపి నేతలు

ప్రజాశక్తి -గాజువాక : 87వ వార్డు, వడ్లపూడి ప్రాంతంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటుచేయాలని జివిఎంసి కమిషనర్‌ రాజబాబుకు గురువారం ఆ వార్డు వైసిపి నేతలు దామోదర్‌, దానప్పలు, గోవిందు వినతిపత్రం అందజేశారు. వడ్లపూడి ప్రధాన రహదారి నుండి కణితి గాంధీబొమ్మ వరకు ప్రధాన రహదారి అభివృద్ధి చేయాలని కోరారు. గ్యాస్‌ పైప్‌లైన్‌ కోసం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ తవ్వి వదిలేసిన గోతులను పూడ్డి, రోడ్డు బాగుచేయించాలని కోరారు.
ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలి
గాజువాక : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించి పెంచాలని జివిఎంసి కమిషనర్‌ రాజబాబు కోరారు. 87వ వార్డు తిరుమలనగర్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. వర్షపు నీరు వృథా కాకుండా సంరక్షించాలని కోరారు. అనేక వ్యాధులకు కారణమైన దోమలు, లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు జివిఎంసి కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా గాజువాక జోనల్‌ కార్యాలయంలో రెండు చెత్తసేకరణ వాహనాలను ప్రారంభించారు.కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జోనల్‌ కమిషనర్‌ సింహాచలం, ఎసిపి రమణమూర్తి, ఇఇ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.