వినుకొండ: కౌలు రైతు గుర్తింపు కార్డుల మంజూరుకు భూ యజమానులు కౌలు రైతులకు సహకరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. జగనన్న సురక్ష లో భాగంగా బుధవారం వినుకొండకు వచ్చిన ఆయన మండలంలోని ఏనుగుపాలెం సచివాలయాన్ని సందర్శించి జగనన్న సురక్ష ద్వారా మంజూరైన 29 మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు అందజేశారు. అలాగే కంది పంట సాగుచేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అంద జేశారు. అనంతరం వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగనన్న సురక్ష ఇంటింటి సర్వే పల్నాడు జిల్లాలో 90 శాతం పూర్తి చేశామని 11 రకాల సర్టిఫికెట్ల ఉచిత మంజూరులో సురక్ష ద్వారా 45 శాతం పూర్తి అయిందన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా నివేశనా గృహాలు, స్థలాలు లాంటి సమస్యలను పరిగణనలోకి తీసుకొని 20 రోజుల్లో పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు భూమి సాగు విస్తీర్ణం మూడు లక్షల ఎకరాలకు పైగా ఉందని ప్రతి రైతు పంట ఈ-క్రాప్ చేసుకోవాలని కోరారు. భూ యజమానులు కౌలు రైతులకు ఇవ్వడం వలన ఎటువంటి ఇబ్బందులు లేవని దీనిపై గ్రామాల్లో రైతులకు రెవెన్యూ అధికారుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. భూమి కౌలుకు తీసుకున్న వారికి భూ యజమాని ఫామ్-1 పై అనుమతి సంతకం చేయాలని తెలిపారు. జిల్లాలో 55 వేల సిసిఆర్సి కార్డుల మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇప్పటికీ 25,000 కౌలు రైతు కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. లక్ష కౌలు రైతు కార్డు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సిసిఆర్సి కార్డు పొందడం వలన కౌలు రైతులకు ఆర్థికల నుండి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని రైతు భరోసా 13,500 తోపాటు పంట నష్టపోతే పరిహారం కూడా వస్తుందని ఎందుకు భూ యజమానులు సహకరించాల్సిందిగా కోరారు. భూ యజమానులు అందుబాటులో లేకపోయినా వీడియో రికార్డింగ్, మెయిల్ ద్వారా కూడా వారి అనుమతిని తెలిపితే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డులు జిల్లాలో 8వేల మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని, వారిలో 2వేల మంది గొర్రెలు మేకల పెంపకం దారులు కాగా, 6వేల మంది గేదెల పెంపకం దారులు ఉన్నట్లు తెలిపారు.జిల్లాలో 28 మండలాల్లో 80 గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందని, 20 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 3.25 లక్షల ఎకరాలకు 2.75 లక్షల ఎకరాల రీ సర్వే జరిగిందని ఆగస్టు 31 లోపు పూర్తి చేసి సెప్టెంబర్ 30 కి హద్దురాళ్ళు వేసి, అక్టోబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి చేతుల మీదగా రైతులకు అనుమతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. శావల్యాపురం, ఈపూరు, నూజెండ్ల మండలాల్లో జగనన్న సురక్ష పథకం నిర్వహణను పరిశీలించారు. స్పెషలాఫీసర్ శ్రీరాములు రెడ్డి, తహశీల్దార్ కిరణ్ కుమార్ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
కౌలు రైతు కార్డుల ప్రక్రియ వేగవంతం చేయండి
ఈపూరు: కౌలు కార్డుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసి కౌలు కార్డులు రైతులకు అందజేయాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. స్థానిక తహఖీషల్దార్ కార్యాలయంలో భూ రి సర్వే, కౌలు రైతు కార్డుల పనులపై ఆరా తీశారు. భూ రీ సర్వే పనులలో కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే మండలంలో 2000 మంది రైతులకు కౌలు కార్డులు అందించేడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు.










