Jun 09,2023 23:18

కుంచనపల్లిలో కరపత్రాలు పంచుతూ, ప్రచారం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు

తాడేపల్లి రూరల్‌: భూ యజమానితో సంబంధం లేకుండా సిసిఆర్‌సి కార్డును కౌలు రైతుకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర రావు అన్నారు. శుక్రవారం ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లి లో మూడు ప్రాంతాలలో కౌలు రైతులకు కర పత్రాలు పంపిణీ చేస్తూ, కౌలు రైతు సంఘం నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ శంకరరావు మాట్లాడుతూ ప్రస్తుత తరు ణంలో కౌలుతో వ్యవసాయం చేసే కౌలు రైతులు పం డించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కౌలు రైతులు బ్యాంకుల నుండి రుణాలు పొందేందుకు భూ యజ మాని సంతకం ఉం డాలన్న అధికారుల నిబంధన సరైన పద్ధతి కాదన్నారు. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు పంటలో నష్టపోయి, నష్టపరిహారం అందక కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నారన్నారు. తక్షణమే భూ యజమాని సంతకం ఉండా లన్న నిబంద óనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా ఈ నెల 12వ తేదీన కౌలు రైతుల సమస్యలపై మంగళగిరి లోని సిసిఎల్‌ ఏ కార్యాలయం వద్ద జరిగే రాయబార కార్యక్రమంలో కౌలు రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కష్ణ, రైతు సంఘం మండల నాయకులు అమ్మిశెట్టి రంగారావు, అమ్మిశెట్టి రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.