Sep 26,2023 00:40

వినతులు స్వీకరిస్తున్న ఆర్‌డిఒ

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌్‌:స్థానిక రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయంలో ఆర్డిఓ జయరాం ఆధ్వర్యంలో స్పందన కార్య క్రమం నిర్వహించారు. ఈ స్పందనకు భూ సమస్యలపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ, స్పందనలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌ కు సంబంధించి ఫిర్యాదులు కూడా అందాయి. రావణాపల్లి రిజర్వాయర్‌ నుంచి కేడి పేట మార్గాన ఉన్న కాలువను కొంత మంది ఆక్రమించారని ఇరిగేషన్‌ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదు దారులు తెలిపారు. నర్సీపట్నం మండలంలో జగనన్న కాలనీలకు సంబంధించి ఎంత మంది దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. వాటి వివరాలు అందించాలని ఆర్‌టిఐ కింద గబ్బాడ సర్పంచ్‌ ఈర్లే రాజేశ్వరి స్పందనలో కోరారు. గబ్బాడ గ్రామంలో జగనన్న కాలనీకు సంబంధించి స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వగా ఓ రైతు స్థలం తనదే అంటూ అడ్డుపెడుతున్నాడని స్పందనలో ఫిర్యాదు చేశారు. స్పందన లో ఫిర్యాదులపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ జయరాం ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ అన్నాజీరావు పాల్గొన్నారు.