పరిశీలిస్తున్న జెసి
ప్రజాశక్తి-డుంబ్రిగూడ:ప్రభుత్వం నిర్వహిస్తున్న శాశ్వత భూ హక్కు పథకంలో భాగంగా మండలంలోని పోతంగి పంచాయతీ ఉయ్యాలగూడ గ్రామంలో సోమవారం రెవెన్యూ అధికారులు చేపట్టిన భూరి సర్వేను అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ శివ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే తీరుపై ఆ గ్రామ గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల్లో ఎటువంటి గొడవలు ఏర్పడకుండా రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ముజీబ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.కామరాజు, సర్వేయర్ వెంకటేశ్వరరావు, కమ్యూనిటీ సర్వేయర్ సద్దు, వీఆర్వో ఝాన్సీ లక్ష్మి, ఎస్.రమేష్ పాల్గొన్నారు.










