ప్రజాశక్తి-గొలుగొండ:నర్సీపట్నం ఆర్డీవో హెచ్‌వి జయరామ్ శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా పాతకృష్ణదేవిపేటను ఆనుకొని నిర్మాణం జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సమగ్ర భూ సర్వే విధానంపై వివరాలను తహశీల్దార్ ఆనందరావును అడిగి తెలుసుకున్నారు. రీ సర్వేతో రైతులకు శాశ్వత భూ సమస్య పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో ఎంపిడిఒ ఎస్.డేవిడ్‌రాజు, తహశీల్దార్, వ్యవసాయ అధికారి సుధారాణితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రాముఖ్యంగా తీసుకున్న సచివాలయాలు, రైతు భరోసా, హెల్త్ సెంటర్లు సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో ధాన్యం కొనుగోలు ఆర్‌బిఎల్ ద్వారా జరగాలని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఏవోకు సూచించారు. ఓటర్ నమోదు, ఆధార్ అనుసంధానం, ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ఎన్నికల నియమావళి అనుసరించి నిర్దేశించిన సమయంలో పూరి ్తచేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఆర్డీవో వెంట డిఐఓఎస్‌లు, మండల సర్వేయర్ చినబాబు, సహాయక సిబ్బంది ఉన్నారు.
.










