Nov 24,2022 23:38

సభలో మాట్లాతున్న తహసీల్దార్‌.

ప్రజాశక్తి-అరకులోయ :భూమి రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని అరకులోయ తహసీల్దార్‌ వేణుగోపాల్‌ సూచించారు. అరకులోయ మండలం బొండం పంచాయతీ రంపుడువలస గ్రామంలో గురువారం భూమి రీ సర్వే గ్రామ సభ నిర్వహించడం తో పాటు, రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంగా తహసిల్దార్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ,భూ సర్వేలో సరిహద్దులు, సాగుబడిలో ఉన్న భూములు సర్వే నెంబర్‌ వంటి సమస్యలు, తండ్రి నుండి సంక్రమించిన భూములు కొడుకులకు పంపకాలు, సర్వే నెంబర్‌ లు ఏవైనా ఇబ్బందులు రీ సర్వే ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచన్నారు. ఈ కార్యక్రమంలో బొండం పంచాయతీ సర్పంచ్‌ దూరియా భాస్కరరావు, పంచాయతీ పీసా కమిటీ సభ్యుడు పాల్గొన్నారు.