జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్
ప్రజాశక్తి -అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన భూ రీ సర్వేను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం మండలంలో సందర్శించిన ఆయన గత రెండు నెలలుగా జరుగుతున్న రీ సర్వే పనితీరును మండల రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాశీపట్నం పంచాయతీ పరిధి పందిరిమామిడివలస, పల్లంవలస గ్రామాల్లో సందర్శించారు. రోజువారి సర్వే నిర్వహించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియపరచాలన్నారు. సర్వేను మరింత వేగవంతం చేపట్టేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని క్షేత్రస్థాయి రెవిన్యూ సర్వే బృందాలు అలసత్వం వహించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ రాంభాయి పాల్గొన్నారు..










