Nov 10,2022 00:07

సిహెచ్‌సి వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న జెసి కల్పనాకుమారి

ప్రజాశక్తి - కె.కోటపాడు
జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.కల్పనాకుమారి బుధవారం మండలాన్ని సందర్శించి భూముల రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు. మండలంలో మలివిడత 10 గ్రామాల్లో భూముల రీసర్వే పనులు ప్రారంభమైన నేపథ్యంలోఆమె వారాడ గ్రామాన్ని సందర్శించారు. భూముల రీసర్వే తీరుపై రైతులతో మాట్లాడారు. రైతులు సంతప్తి వ్యక్తం చేశారని జేసీ తెలిపారు. అనంతరం ఇక్కడ తహసీల్దార్‌ కార్యాలయంలో రీసర్వే ప్రగతిపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలిదశ రీసర్వేలో అనుభవాల దష్ట్యా రెండో దఫా రీసర్వేలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా రీసర్వే జరుపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జి.రమేష్‌ బాబు, ఉపతహశీల్దార్‌ డి.రమేష్‌ బాబు, అర్‌ఐలు, విఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
ఆసుపత్రిలో ఆకస్మిక తనఖీ
స్థానిక ఏపీ వైద్య విధాన పరిషత్‌ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి ఆకస్మికంగా సందర్శించారు. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో కె.జె.పురంలో ఇంటికి వెళ్తున్న బాలింతను పలకరించి వైద్యసేవల గురించి అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మహిళా వార్డును సందర్శించారు. 50 పడకల కోసం నిర్మిస్తున్న భవనాల పనులను జేసీ పరిశీలించారు. ల్యాబ్‌ వద్ద గర్భిణులతో మాట్లాడారు. అంగన్వాడి కేంద్రం నుంచి పోషకాహారం అందుతుందా అని ప్రశ్నించారు. ఫార్మసీని సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు పట్ల జెసి కల్పనాకుమారి సంతప్తి వ్యక్తం చేశారు.