కురబలకోట : ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల బాధితులు నష్టపోకుండా న్యాయం చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్‌అహ్మద్‌ఖాన్ అన్నారు. బుధవారం మండలంలోని పిచ్చల వాండ్ల పల్లె, వద్ద నిర్మిస్తున్న ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పరిశీలిం చారు. అనంతరం భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులు నచ్చి మెచ్చేలా పరిహారంపై పునరావాసం ఉంటుందన్నారు. ఎవ్వరూ బాధపడకుండా నష్టపరిహారం, ఆర్‌అండ్‌కాలనీ నిర్మిస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ఎప్పటికీ మరువలే రన్నారు. ఈ రిజర్వాయర్‌కు ముదివేడు, పిచ్చలవాండ్లపల్లె, కోటావూరు, కురులకోట గ్రామాల రైతుల భూములు 1075.81 ఎకరాలు పోతు న్నాయని చెప్పారు. మండలానికి చెందిన వారికి ముదివేడు దగ్గరున్న ఎంఐజి లేఅవుట్ పక్కన 30 ఎకరాల్లో ఆర్ అండ్‌ఆర్ కాలనీ ఏర్పాటు చేస్తా రని తెలిపారు. బి. కొత్త మండలానికి చెందిన వారికి కాండ్లమడుగు క్రాస్ వద్ద ఏర్పాటు చేస్తారన్నారు. గుడి, బడి, తాగునీరు, మురికినీటి కాలువలు, ఆస్పత్రి, పశువుల ఆస్పత్రి, కమ్యూనిటీహాల్, విశాలమైన రోడ్లు, సచివా లయం, ఎటిఎంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి బాధితుడికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. లేకుంటే ఒటిఎస్ కింద రూ. 8.60 లక్షలు అంది స్తామని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టిలకు అదనంగా మరో రూ.50 వేలు పరి హారం అందుతుందన్నారు. బాధిత రైతులకు సంతప్తికరంగా పునరావాసం ఉంటుందన్నారు. ముదివేడు సచివాలయాన్నీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఎఎన్‌ఎంతో మాట్లాడుతూ గర్భిణులకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రభత్వ పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ దిలీప్‌కుమార్, తహశీల్దార్ భీమేశ్వర్‌రావు, పిఆర్‌ఒ కులదీప్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










