Sep 25,2023 21:24

మీడియాతో మాట్లాడుతున్న బిటెక్‌ రవి

 పులివెందుల రూరల్‌ భూ కుంభకోణాలకు బాధ్యులైన రెవెన్యూ అధికారుల పై సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సి మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. సోమవారం టిడిపి కార్యాలయం వద్దా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ అక్రమాలు కేవలం అధికార పార్టీ నాయకుల అండతోనే చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చి 25 ఏళ్లు అయివుంటే కలెక్టర్‌ ద్వారా ఎన్‌ఒసి తీసుకుని రిజిస్టర్‌ చేయించుకుని క్రయవిక్రయాలు చేసుకోవ్చని, కానీ అలా చేయకుండా రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిజమైన అర్హులు ఎన్‌ఒసికి దరఖాస్తు చేసుకుంటే కుంటి సాకులు చెప్పి తిరస్కరించారని అన్నారు. ఇప్పటికే వందల మంది తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి జిఒ కింద అర్హత ఉన్న భూములను గుర్తించి, వారి జాబితాను తయారు చేసి ప్రతి గ్రామంలో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 2024 లో తెదేపా అధికారం లోకి వస్తే 2019 లో ఏవిధంగా భూ రికార్డులున్నాయో స్టేటస్‌ కో వేసి సిబిఐ విచారణ చేయించి రికార్డులన్నింటినీ సరిదిద్దుతామని చెప్పారు.అసైన్డ్‌లో కూడా భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. వైసిపి నాయకుడు దొండ్లవాగు గ్రామం వద్ద గుట్టను చదును చేసి వందల ఏకరాలు స్వాధీనం చేసుకున్నాడని ఆరోపించారు. వేంపల్లి ,చక్రాయపేట, లింగాల, ఇలా ప్రతిమండలంలోనూ వైసిపి నాయకులు గుట్టలు చదును చేసి ఆక్రమించారు అని విమర్శించారు. ఆక్రమించిన గుట్టలను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుని ఆయా గ్రామ పరిధిలోని పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లా బయటకి వస్తారని చెప్పారు. బుధవారం నుంచి ఇంటింటికీ వెళ్లి చంద్ర బాబు అక్రమ అరెస్ట్‌పై ప్రజలకు వివరించి కర పత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. పులివెందులలో మళ్ళీ రిలే నిరాహరదీక్షలు కొనసాగిస్తాం అని అన్నారు ార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నాయకులు ఉన్నారు