Jun 30,2023 21:07

ధర్నా చేస్తున్న బోయనపల్లె గ్రామస్తులు

 రాజంపేట అర్బన్‌ : కొత్త బోయనపల్లెలో కొన సాగుతున్న భూకబ్జాలను అరికట్టాలని శుక్రవారం ఆర్‌డిఒ కార్యాలయం వద్ద పద్మశా లియులు ధర్నా నిర్వహించారు. కొత్త బోయ నపల్లిలో కబ్జాలు నివారించాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్థానికేతరులు గ్రామంలో విచ్చలవిడిగా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆలయ మాన్యాలు, ఆస్థులను ఆక్ర మణకు గురవుతున్నాయని వాపోయారు. బస్టాండును భూ రాక్షసుల నుంచి కాపా డాలని కోరారు. గ్రామ కంఠ స్థలాలను కబ్జా దారుల కొరల నుంచి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామస్తులు ఆర్‌డిఒ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశారు.