Nov 02,2023 21:00

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం: ఈనెల14న జరగనున్న అసైన్మెంటు భూముల హక్కుల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని సిసిఎల్‌ఎ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ జి.సాయి ప్రసాద్‌ తెలిపారు. గురువారం సిసిఎల్‌ఎ స్పెషల్‌ ఛీప్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌, సర్వే అండ్‌ సెటల్మెంటు కమిషనరు సిద్దార్థ జైన్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రీసర్వేపై సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20ఏళ్లు ముందు పంపిణీ చేసిన అసైన్‌మెంటు భూములకు శాశ్వత హక్కులు దఖలు పరుస్తూ ధ్రువపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 14న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. అందుకు కావాల్సిన పత్రాలన్నింటిని సిద్ధం చేయాలని తెలిపారు. ఎస్‌సిలకు శ్మశానవాటికల కోసం భూసేకరణ పూర్తిచేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరు నిశాంత్‌ కుమార్‌, జాయింటు కలెక్టరు ఆర్‌. గోవిందరావు, డిఆర్‌ఒ జె. వెంకటరావు, సర్వే అధికారులు పాల్గొన్నారు.