
పట్టాపాస్ పుస్తకం ఇస్తున్న ఎమ్మెల్యే బాబూరావు
ప్రజాశక్తి -ఎస్.రాయవరం: మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదగా శనివారం భూ హక్కు భూ రక్ష శాశ్వత పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రీసర్వే లో జరిగిన భూములకు సరిహద్దురాళ్ళు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ప్రభుత్వం పలు పథకాలు రైతులు, ప్రజలకు ప్రవేశ పెడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ కే విజరు కుమార్,. డిప్యూటీ తహాసిల్దార్ వైస్ శ్యామ్ కుమార్, రీ సర్వే డిప్యూటీ తహాసిల్దార్ నారాయణరావు, ఆర్‌ఐ వినరు, వైస్ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, ఎంపిపి అప్పన్న, కొణతాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.