May 01,2023 00:06

పత్రాలు సిద్ధం


ప్రజాశక్తి-కోటవురట్ల:రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రక్ష సర్వే కింద రైతులకు అందజేయనున్న భూ హక్కు పత్రాలు తహసిల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ మేరకు సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి సిబ్బంది పత్రాలను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత సర్వే పూర్తయిన అన్నవరం, ఎండపల్లి, సుంకపూరు, జల్లూరు, రాజుపేట, రామన్నపాలెం గ్రామాలకు సుమారు 1881 పట్టాదారు పాస్‌ పుస్తకాలు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాజుపేట గ్రామానికి భూ హక్కుపత్రాలు రావాల్సి ఉండగా ఐదు గ్రామాలకు 2916 ఖాతాలకు గాను 1881 పుస్తకాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుంకపూరుకు 593, రామన్నపాలెం 308, జల్లూరు 490, ఎండపల్లికు 478, వచ్చాయి. అన్నవరంకు 694 పాస్‌ పుస్తకాలకుగాను కేవలం 12 పుస్తకాలు మాత్రమే వచ్చినట్లు తెలిపారు.