Nov 12,2022 00:40

మాట్లాడుతున్న టిడిపి నాయకులు కృష్ణ, వేదికపై పివిజి.కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - దేవరాపల్లి
విశాఖ ప్రాంతంలో భూముల దోపిడీ కోసమే వైసిపి ప్రభుత్వం పరిపాలన రాజధాని డ్రామాలాడుతోందని టిడిపి మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు లోడగల కృష్ణ ఆరోపించారు. రియల్‌ టైం స్టేటజీపై నియోజకవర్గస్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం స్థానిక రెల్లివీధి సమీపంలో టిడిపి మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగాయి. ఇందులో పాల్గొన్న కృష్ణ మాట్లాడుతూ అందమైన విశాఖ ప్రాంతాన్ని మనీ లాండరింగ్‌ పేరుతో దోసుకుంటున్నారన్నారు. జగన్‌ పాలనలో కూల్చివేతలు, దౌర్జన్యాలు, అరాచకాలు, దోపిడీలు పెచ్చు మీరుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ మాట్లాడుతూ నాలుగు మండలాల పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి టిడిపికి పూర్వవైభవం తీసుకొద్దామన్నారు. అనంతరం ఆర్టిఎస్‌ ట్రైనింగ్‌ కమిటీ సభ్యులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోతల పాత్రునాయుడు, కర్రి సింహాద్రి నాయుడు, సబ్బవరపు రామానాయుడు, కశిరెడ్డి అప్పలనాయుడు, శరఖాన సూర్యనారాయణ, చింతా సాంబమూర్తి, గుల్లిపల్లి అర్జునరావు, బండారు రామారావు, కర్రి పుష్ప, జూరెడ్డి రాము, పేరపు కొండబాబు, రెడ్డి సన్యాసినాయుడు, గొల్లవెల్లి శ్రీరామ్మూర్తి, మజ్జి బాబ్జి, దొగ్గ దేముడు నాయుడు పాల్గొన్నారు.