ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక టీఎం రావు ఉన్నత పాఠశాలలో శని, ఆదివారాలు నిర్వహించిన హిందీ మౌఖిక పరీక్షలు ముగిశాయి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలు పరిచయ, ప్రాథమిక, మాధ్యమిక, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద, ప్రవీణ పరీక్షలకు ఆయా ప్రాంతాల నుండి 165మంది బాల బాలికలు పరీక్షలు రాశారు. గుంటూరుకు చెందిన జి శ్రీనివాసరావు పరీక్ష నిర్వహించారు. హెచ్ఎం సిహెచ్ రామకోటేశ్వరరావు పరీక్షల చీఫ్‌గా వ్యవహరించారు. ఈ పరీక్షలకు కనగాల, గూడవల్లి, చెరుకుపల్లి, చందోలు, భట్టిప్రోలు, చావలి, పెరవలి, సూరేపల్లి గ్రామాల విద్యార్థులు పాల్గొన్నారు.










