ప్రజలకు కరపత్రాలు అందజేస్తున్న మంత్రి నాగార్జున
ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండల కేంద్రం భట్టిప్రోలులో ఆదివారం 'మా నమ్మకం నువ్వే జగన్' కార్యక్రమం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన పథకాల గురించి వివరించారు. ప్రతి కుటుంబానికి అందజేసిన మొత్తం నగదు, పొందిన లబ్ధిని కరపత్రం రూపంలో అందించారు. మా నమ్మకం నువ్వే జగన్ పోస్టర్‌ను అంటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారా రవికిరణ్మయి, ఉప సర్పంచ్ బుర్లే రాంప్రసాద్, ఎంపిటిసి కె పిచ్చయ్య శాస్త్రి, పద్మావతి, నాయకులు చెన్నయ్య, అరుణ్ శాస్త్రి, బి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.










