Jun 23,2023 01:52
తహసీల్దార్‌ వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలుపుతున్న ఎంపిపి డివి లలితకుమారి

ప్రజాశక్తి-భట్టిప్రోలు: భట్టిప్రోలు మండల నూతన తహశీల్దారుగా డి వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఎంపిపి డివి లలితకుమారి పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈయన రేపల్లె మండల రెవెన్యూ కార్యాలయంలో డిటి గాను సివిల్‌ సప్లరులో పని చేస్తూ పదోన్నతిపై భట్టిప్రోలు తహశీల్దారుగా భాద్యతలు తీసుకున్నారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.