Sep 12,2023 00:10

ప్రజాశక్తి - భట్టిప్రోలు
టిడిపి ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు సోమవారం టిడిపి నాయకులు బందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి తునుగుంట్ల సాయిబాబాను, టిడిపి మండల మాజీ కన్వీనర్ వై కరుణ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కనపర్తి సుందర్రావును గృహనిర్బంధం చేశారు. టిడిపి  మండల అధ్యక్షులు వాకా శేషుబాబు, నాయకులు సిరాజుద్దీన్, వేములపల్లి జగన్నాధరావు, రత్నప్రసాద్, రాయన ప్రసాద్, ఎడ్ల జయశీలరావు, మరి కొంతమందితో పాటు బందుకు మద్దతును ప్రకటించిన ఎస్ఎఫ్ఐ నాయకులు పి మనోజ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లో నిర్భందించారు. సాయంత్రం ఐదు గంటల వరకు 50మందికిపైగా నాయకులు, కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. బంద్‌ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.