Aug 07,2023 22:03

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌డిఒ వెంకటేశులు

పులివెందుల టౌన్‌ : భ్రూణ హత్యలపై ప్రజలకు అవగాహన కల్పిం చాలని ఆర్‌డిఒ వెంకటేశులు సూచించారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో సోమవారం సబ్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ మల్టీ మెంబర్‌ అప్రోప్రియేట్‌ ఆథారిటీ, సబ్‌ డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ అడ్వైజర్‌ కమిటీ యాక్ట్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశంలో లింగనిష్పత్తి, భ్రూణహత్యల నివారణకు స్కానింగ్‌ కేంద్రాలపై పూర్తిస్థాయి నిఘా ఉంచాలన్నారు. అవగాహనా సదస్సులు, కళాజాత ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వైద్యుల సిఫారస్‌ లేకుండా గర్భస్రావం మాత్రలను ఇచ్చే దుకాణాలు, ఏజె న్సీలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. ఇన్‌ఛార్జి డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అరి ఫుల్లా, ప్రాంతీయ ఆసు పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజు, గైన కాలజిస్ట్‌ డాక్టర్‌ లక్ష్మిప్రియ, డాక్టర్‌ శుభశ్రీ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు.హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మల్లయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ నరేష్‌ పాల్గొన్నారు.