విషపు సమాజంలో
మాపై చిన్నచూపు దేనికో
మేమూ మనుషులమే
గర్భందాల్చిన ప్రతీ స్త్రీ
పసిబిడ్డకు జన్మనివ్వాలనే తపన
బాధాతప్త హృదయాన్ని సంతోషంగా మార్చి
విలువైన జీవితానికి పునాదిలా ఉండే మాకు
తల్లి కావాలనే ఆత్మీయ ఆలోచనలు వచ్చేలోపు
కొంతమంది మగవారి బుద్ధే దేనికోసమో
ఎడమొహం, పెడమొహం వంకర దేనికో
ఆడా, మగ శిశువుల గుర్తుల కోసమే
అవయవాల తనిఖీ యంత్రాలతో
కుతూహలంగా తెలుసుకోవాలనే పనిలో
పన్నాగాలు.. ఎన్ని పన్నాగాలో
వృధా అయ్యే సమయంలోనైనా
ఒక్కసారైనా మంచి గుర్తొస్తే
ఉత్తమ పురుషుడిగా ఉండేవారేమో
మగ శిశువు కావాలనే ఆరాటంలో
ఆడశిశువును చంపే ప్రయత్నం దేనికో
తల్లి చనిపోయినా పర్వాలేదు
కడుపులో ఆడబిడ్డ మాత్రం పోవాలి
పసిగుడ్డు కథ సుఖాంతమవ్వాలి
పెళ్లయిన స్త్రీలే కాదు, పెళ్లి కాని స్త్రీలు కూడా
భ్రూణహత్యలకు గురైన సంఘటనలెన్నో
కనిపించని వాస్తవ దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో
ఆడ శిశువులను బతకనివ్వండి
మహాలక్ష్మిలా ఇంటిలో వెలగనివ్వండి
దాసరి కళ్యాణి
63047 86213