Jun 27,2021 10:57

ప్రపంచమంతా వైరస్‌ వ్యాపించి ఉంది. దాని బారిన పడకుండా ఉండాలంటే మనలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుబాటు ధరల్లో ఉండే పోషకాల గని ఏదైనా ఉందంటే అది బప్పాయే. ఈ వారం బప్పాయితో చేసే వెరైటీ వంటలు మీకోసం...

పరోటా :
కావాల్సిన పదార్థాలు:
పచ్చి బప్పాయి తురుముా కప్పు, గోధుమపిండిా ఒకటిన్నర కప్పు, కొత్తిమీర తరుగుా పావుకప్పు, పచ్చి మిరపకాయలుా రెండు లేదా మూడు (ముక్కలుగా తరుక్కోవాలి), పసుపుా పావు టీస్పూను, కారంపొడిా అర టీస్పూను, ఎండిన మామిడిపొడిా రెండు టీస్పూన్లు, ఉప్పుా తగినంత, నూనో రెండు టేబుల్‌స్పూన్లు.

భరోసానిచ్చే బొప్పాయి
తయారుచేసే విధానం:
- ముందుగా గోధుమపిండిని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- బప్పాయి తురుమును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పువేసి, బాగా కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- బప్పాయి తురుములో ఉన్న వేస్ట్‌ నీరంతా బయటకు వస్తుంది. వాటిని చేతితో పిండి పక్కన బౌల్‌లో పెట్టుకోవాలి.
- అందులో పసుపు, పచ్చిమిరపకాయ తరుగు, తరిగిన కొత్తిమీర ఆకులు, కారం, ఎండు మామిడి పొడిని వేసి బాగా కలిపి ముద్దగా పక్కన పెట్టుకోవాలి.
- ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండిని ఉండలుగా చేసుకోవాలి. వాటిని చేతిలోకి తీసుకొని చిన్న గుంతలా చేయాలి.
- అందులో ముందుగా తయారుచేసి పెట్టుకున్న బప్పాయి మిశ్రమం కొంచెం తీసుకుని ఉండ మధ్యలో పెట్టాలి.
- ఆ పదార్థం బయటకు కనిపించకుండా గోధుమపిండితో కవర్‌ చేసి, మరలా ఉండలా చేసుకోవాలి.
- ఇప్పుడు చపాతీలు ఎలా చేస్తామో అలాగే చపాతీ కర్రతో చేసుకోవాలి.
- తర్వాత దానిని పాన్‌పై వేసి బంగారువర్ణం వచ్చే వరకు కాల్చాలి. అప్పుడు దానిమీద కొంత నూనె వేసి పరోటా అంతా స్ప్రెడ్‌ అయ్యేలా చేయాలి. అంతే వేడివేడి పరోటా రెడీ.
- దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

కబాబ్ : 

కావాల్సిన పదార్థాలు : బప్పాయి తురుము- కప్పు, ఉడికిన బంగాళదుంపలు (ముద్దగా చేసుకోవాలి)- కప్పు, ఉప్పు- తగినంత, కారం- అర టీస్పూను, జీలకర్ర పొడి- అర టీస్పూను, ధనియాల పొడి- అర టీస్పూను, దానిమ్మ విత్తనాల పొడి - టీ స్పూను, అల్లం (తురిమినది) - అర టీస్పూను, కొత్తిమీర ఆకులు (తరిగినవి)- ఒకటి లేదా రెండు స్పూనులు, బ్రెడ్‌ ముక్కల పొడి- రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి- ఒకటి లేదా రెండు.

కావాల్సిన పదార్థాలు :
తయారుచేసే విధానం:
- ముందుగా బప్పాయి తురుమును ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులోనే బంగాళాదుంపల ముద్ద, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, దానిమ్మ విత్తనాల పొడి, అల్లం తురుము, బ్రెడ్‌ ముక్కల పొడులను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత ఇంకొక బౌల్‌ తీసుకుని అందులో కొంచెం పెరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ముందుగా పక్కన పెట్టుకున్న బప్పాయి, బంగాళాదుంపల ముద్దను చేతిలోకి తీసుకుని వడలా కొంచెం ఒత్తుకోవాలి. దానిమీద పక్కన పెట్టుకున్న పెరుగును కొంచెం వేసుకోవాలి.
- పెరుగు కనబడకుండా బప్పాయి, బంగాళాదుంపల ముద్దను చిన్న ఉండలా చుట్టాలి.
- తర్వాత 4,6 టేబుల్‌ స్పూనుల నూనెను పాన్‌లో వేయాలి. అది కాగాక అందులో బప్పాయి ఉండలను ఒక్కొక్కటిగా వేయాలి.
- బంగారువర్ణం వచ్చే వరకు అటూ, ఇటూ తిప్పుతూ ఒక్కొక్కటిగా వేగనివ్వాలి. తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అంతే కబాబ్స్‌ రెడీ.

ఆవకాయ :
కావాల్సిన పదార్థాలు: పచ్చిబప్పాయి ముక్కలు- పెద్ద కప్పు, నూనె- నాలుగు టీస్పూనులు, నిమ్మరసం - రెండు టీస్పూనులు, కారం- టీస్పూను, ఉప్పు- తగినంత, ఆవపిండి- పావు టీస్పూను, మెంతిపిండి- పావు టీస్పూను, ఇంగువ- చిటికెడు, పసుపు- చిటికెడు.కావాల్సిన పదార్థాలు :
తయారుచేసే విధానం :
- ముందుగా పొడిగిన్నెలో బప్పాయి ముక్కలు వేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ, నిమ్మరసం, నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.
- ఉప్పు కాస్త ఎక్కువ తినేవారు మరికాస్త వేసుకోవచ్చు. రెండోరోజుకు ముక్క ఊరి పచ్చడి తినడానికి బాగుంటుంది. ఇష్టమైనవారు ఒక టీ స్పూను వెల్లుల్లి తురుము కూడా వేసుకోవచ్చు.
- అంతే సింపుల్‌గా తయారయ్యే బప్పాయి ఆవకాయ రెడీ..! ఇది మధుమేహ రోగులకు మంచి ఔషధంగానూ పనిచేస్తుంది.