Jul 30,2023 01:25
భోజన ప్లేట్లను పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-వేటపాలెం: జివికెసి ఎయిమ్‌ ఫర్‌ సేవ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులకు భోజన ప్లేట్స్‌ పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చక్కటి క్రమశిక్షణ కలిగి ఉండేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పి హరిబాబు మాట్లాడతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పరచుకొని చదువులో ఎదగాలి అని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ప్రత్తి కృష్ణ మూర్తి, మానస, మౌనిక, రావి మస్తాన్‌రెడ్డి, స్వామి రాఘవేంద్ర, పూల శ్రీనివాసరావు, ప్రేరక్‌ సుబ్రహ్మణ్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.