Jan 14,2023 23:30

అనకాపల్లిలో జిఒ కాపీలు దగ్ధం చేస్తున్న నేతలు

ప్రజాశక్తి-అనకాపల్లి : రోడ్లపై ప్రదర్శనలు, రోడ్‌ షోలను నిషేధిస్తూ ప్రభుత్వం విడుదల చేసి జిఒ 1 ప్రతులను టిడిపి ఆధ్వర్యాన స్థానిక పరమేశ్వరి పార్కు సెంటర్లో శనివారం భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, నాయకులు మారిశెట్టి శంకర్రావు, పొలిమేర నాయుడు, బొడ్డేడ మురళి, మల్ల గణేష్‌, కొణతాల బాల, బుద్ధ భువనేశ్వర్‌ రావు, పాల్గొన్నారు.
రాంబిల్లి : మండలంలోని పంచదార్ల గ్రామంలో మాజీ ఎంపీపీ లక్ష్మీ, టిడిపి మండల అధ్యక్షులు వసంతవాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిఒ 1 కాపీని భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : జీవో నెంబర్‌ 1 రద్దు చేయాలని కోరుతూ జీవో కాపీలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో భోగి మంటలో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు బత్తుల తాతయ్య బాబు, గోకవాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, ముచ్చకర్ల తాతయ్యలు, గొన్నాబత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కశింకోట : భోగీ పండుగ సందర్భంగా మండలంలోని తీడ గ్రామంలో టిడిపి నాయకులు జిఓ 1 పత్రులను భోగి మంటల్లో తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణ, పార్టీ నాయకులు కోట్ని బాలాజీ, కాయల మురళి, ఉగ్గిన రమణమూర్తి, వేగి గోపికృష్ణ, సిదిరెడ్డి శ్రీనివాసరావు, చిరికి సన్యాసి నాయుడు, మెడిసెట్టి సన్యాసి నాయుడు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని వెన్నలపాలెం గ్రామంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు స్వగృహంలో టిడిపి నాయకులు భోగి వేడుకలు నిర్వహించి, చీకటి జిఒ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పైల వరలక్ష్మి, గొంప మారునాయుడు, వాసిరెడ్డి ఈశ్వరరావు, బండారు వీరు నాయుడు, పైల రమణాజీ, పైల ప్రసాదు, లోకిరెడ్డి సన్యాసి నాయుడు పాల్గొన్నారు.
దేవరాపల్లి : జీవో -1ను రద్దు చేయాలని కోరుతూ టిడిపి నాయకులు చీకటి జీవోను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, ఆదిరెడ్డి వరలక్ష్మి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.
అచ్యుతాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో వన్‌ కాపీలను టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కర్రి ఆదిబాబు తదితరులు శనివారం భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్ల చిన్నబాబు, మల్ల నాగేశ్వరావు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక టిడిపి కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక ఒకటో నెంబర్‌ జిఓ ప్రతులను ఆ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. సైకో పోవాలి అన్న నినాదంతో కూడిన ప్ల కార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, డిఎఎన్‌ రాజు, మూడో వార్డు కార్పొరేటర్‌ గంటా అప్పల కొండ, పార్టీ నాయకులు టి సూరిబాబు, పాసి నరసింగరావు, జె గణేష్‌ రెడ్డి, ఎం సంజీవ్‌ కుమార్‌, కనకల అప్పల నాయుడు, గరే సదా నంద తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లి:జాతీయ రహదారిపై సభలు, ప్రదర్శనలు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1ని రద్దు చేయాలని టిడిపి శ్రేణులు డిమాండ్‌ చేశారు. మండలంలోని డిఎల్‌ పురం, గొడిచెర్ల, డొంకాడ, రాజయ్యపేట తదితర గ్రామాల్లో శనివారం భోగిమంటల్లో జీవో 1 ప్రతులను దగ్ధం చేశారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కెందుకే చీకటి జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు గింజాల లక్ష్మణరావు, వైబోయిన రమణ, పిక్కి కోదండరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంట:తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 1 పత్రాలను శనివారం మండలంలోని నిండుగొండ గ్రామంలో టీడీపీ నాయకులు భోగి మంటల్లో వేసి దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నర్సీపట్నంరూరల్‌:పట్టణంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంట భోగి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిఒ 1 కాపీలను భోగి మంటల్లో వేశారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసిపి ప్రభుత్వాని సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి పద్మావతి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.