ప్రజాశక్తి - చిప్పగిరి
శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీభోగలింగేశ్వర స్వామిని రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ధనుంజయుడు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. వీరికి కమిటీ సభ్యులు, వేద పండితులు ప్రత్యేక ఆహ్వానం, దర్శన అవకాశం కల్పించారు. వీరిని చిప్పగిరి రైల్వే కాంట్రాక్టర్, పంచాయతీ రాజ్ ఉమ్మడి జిల్లాల వింగ్ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి, చిప్పగిరి జ్యువెల్లర్స్ షాపు యజమాని, పారిశ్రామికవేత్త సత్య ప్రతాప్ వేర్వేరుగా ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సత్య ప్రతాప్ మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం చిప్పగిరి భోగలింగేశ్వర స్వామి దేవాలయమని తెలిపారు. ఇలాంటి పుణ్యస్థలాలను, చరిత్ర కలిగిన దేవాలయాలను రైల్వే జనరల్ అసిస్టెంట్ మేనేజర్ దర్శించుకోవడం ఆనందదాయకమని చెప్పారు. రైల్వే జనరల్ మేనేజర్ కుటుంబ సభ్యులు పరిచయాల వల్ల అతనికి ఘన స్వాగతం పలికి ఆహ్వానించి సన్మానించినట్లు తెలిపారు. చిప్పగిరి మండల అభివృద్ధికి కృషి చేస్తామని, అన్ని గ్రామాల్లో రైతులతోనూ, ప్రజలతోనూ తమ కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఎజిఎం ధనుంజయుడు దంపతులను సన్మానిస్తున్న సత్య ప్రతాప్










