Aug 12,2023 20:10

వ్యాపారులతో మాట్లాడుతున్న సహాయ కమిషనర్‌ వాణి

ప్రజాశక్తి - కౌతాళం
శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తప్పవని దేవాలయ సహాయ కమిషనర్‌ వాణి హెచ్చరించారు. శనివారం ఉరుకుందలో టెంకాయల అమ్మకందారులు, కల్యాణ కట (తలనీలాలు సమర్పించే స్థలం)్టలో పని చేసే కార్మికులు, వివిధ వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంతో భక్తితో వచ్చే భక్తులకు దేవదాయ శాఖ నిర్ణయించిన ధరలకే వస్తువులు విక్రయించాలని ఆదేశించారు. కల్యాణ కట్టలో గుండు గీయించుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేసినా, టెంకాయలు అధిక ధరలకు అమ్మినా కేసుల నమోదు చేస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పని చేసి దేవాలయానికి చెడ్డ పేరు తీసుకు రావద్దని కోరారు. ప్రతి వ్యాపారుడూ సహకరించాలని, పుణ్యక్షేత్రానికి మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలిగినా వదిలిపట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్‌ఐ నరేంద్ర కుమార్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు వెంకటేష్‌, రామ్మోహన్‌ పాల్గొన్నారు.