ప్రజాశక్తి - ఆదోని
ఆదోని నియోజకవర్గంలో గురువారం బక్రీద్ సందర్భంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని 60 మసీదుల్లో నమాజ్ చేసినట్లు పట్టణం ఖతిబ్ సాబ్ జునేద్ హష్మి తెలిపారు. పట్టణంలోని షాహి జామియా మసీదు, పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు వేలాదిమంది ముస్లింలు హాజరయ్యారు. మసీదులో ఖతిబ్ సాబ్ జునేద్ హష్మి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంట్లో ముస్లింలు ఎమ్మెల్యేను సన్మానించారు. మండలంలోని పెద్దతుంబలం, పెద్ద హరివాణం, సంతేకుడ్లూరు, హానవాలు తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా డీఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆదోనిలో ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలు










