Apr 07,2023 19:11

బేతంచర్ల : గుడ్‌ ఫ్రైడే సందర్భంగా సిలువను మోస్తూ ఊరేగింపు

భక్తి శ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

ఆత్మకూరు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాలలో గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. యేసుక్రీస్తు బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకోవాలని వివరించారు.
చాగలమర్రి: శుభ శుక్రవారం పర్వదినాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నంద్యాల డయాసిస్‌ సిఎస్‌ఐ చర్చ్‌లలో వేడుకలను నిర్వహించారు. చాగలమర్రి మండలంలోని పెద్ద భోదనం పాస్టర్‌ పరిధిలో రెవరెండ్‌ సంపత్‌ కుమార్‌ ప్రసంగించారు. ప్రార్థనలో ముత్యాలపాడు చర్చి ఫాదర్‌ రెవరెండ్‌ సంజీవరాజ్‌, చాగలమర్రి డీనరీ చైర్మన్‌ సంతోష్‌ కుమార్‌, పెద్ద వంగలి పాస్టరెట్‌ చైర్మన్‌ లాంబర్ట్‌, తోడేళ్లపల్లి రెవరెండ్‌ఐజయ వరప్రసాదరావు, మద్దూరు రెవరెండ్‌ చిరంజీవి, ఆర్‌.సి.యం ఫాదర్‌ విజరు, మార్తమ్మ చర్చి ఫాదర్‌ బ్లెస్స్‌ న్‌, రెవరెండ్‌ ఆనందరావు, ఇతర ప్రైవేట్‌ చర్చి నిర్వాహకులు క్రిస్టఫర్‌ డేవిడ్‌ తదితరులు ప్రసంగించారు. అనంతరం ఆయా చర్చలలో ఏర్పాటుచేసిన విందులను పంచిపెట్టారు నేటితో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు 40 దినాలు చేపట్టిన ఉపవాస దినాలను ప్రార్థనలతో ముగించారు. ప్రార్థనలలో ఆయా గ్రామాల పెద్ద మనుషులు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. బండి ఆత్మకూర్‌: మండలంలో గుడ్‌ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. సిఎస్‌ఐ ఆర్‌సిఎం. ఏసన్న, మినిస్ట్రీస్‌ బైబిల్‌ మిషన్‌ చర్చిలలో ప్రార్థనలు చేశారు. పాములపాడు : మండలంలోని సిఎస్‌ఐ, ఆర్‌సిఎం, జెరూషలేం, బేతానయ క్రిస్టియన్‌ బ్రదర్స్‌ అసెంబ్లీ చర్చిలలో క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఉపవాస ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ప్రతి ఒక్కరు సమాధానంతో జీవించాలని పాస్టర్లు బోధించారు. అనంతరం చర్చిల దగ్గర ఆశీర్వాద భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. బేతంచర్ల : బేతంచెర్ల పట్టణం, గ్రామాలలో గుడ్‌ ఫ్రైడేను ఘనంగా జరుపుకున్నారు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి ఫాదర్స్‌ కిరణ్‌, జోసెఫ్‌ ఆధ్వర్యంలో సిలువను మోస్తూ ఊరేగింపు నిర్వహించారు. పగిడ్యాల : మండలంలో ఆయా గ్రామాలలో గుడ్‌ ఫ్రైడేను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. ముచ్చుమర్రి గ్రామంలో బిజెవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి దళిత కాలనీలలో అందరితో కలిసి భోజనం చేశారు. గ్రామంలో ఆరోగ్య సమస్యలపై త్వరలో మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తామ శబరి తెలిపారు. జిల్లా బీజేవైఎం అధ్యక్షులు చైతన్య కుమార్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేష్‌, బిజెపి నందికొట్‌ నియోజవర్గం ఇంచార్జి కొండెపోగు చిన్న సుంకన్న, రాంబాబు నాయుడు, సురేష్‌, కరీం బాష, నాగన్న, రాజు, దుబ్బన్న, అబ్రహం, సోలోమన్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : మండలంలో గుడ్‌ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు జరుపుకున్నారు. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. దాతల సహకారంతో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.