కడప కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భిన్నత్వంలో ఏక త్వం అని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కార్యాలయంలో బుధ వారం యూత్ కాంగ్రెస్‌కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ గురించి జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వ హించారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అనుబంధ సంఘాలు, సెల్స్, ఉన్నప్పటికీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దానికి పని చేస్తాయన్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి వివ రించడానికి జోనల్ రిటర్నింగ్ ఆఫీసర్ గోపాలకష్ణ యూత్ కాంగ్రెస్ కు సంబ ంధించిన ఎన్నికల ప్రక్రియ గురించి నియమాలిని వివరించారు. అనం తరం తులసిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ యువతి, యువకులకు పెద్దపీట వేస్తు ందని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా మన్నారు. నరేంద్ర మోడీ ఏమి మేలు చేశారని రాష్ట్రానికి వస్తున్నాని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి, రాష్ట్ర నాయకులు బండి జకరయ్య, నజీర్ అహ్మద్, సత్తార్, వెంకటరమణారెడ్డి, చార్లెస్, విజరుకుమార్, ఆరిపుల్లా, శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, చంద్రశేఖర రెడ్డి, లక్ష్మయ్య, బాబు, శివ, ప్రసాద్ గౌడ్, ఓబులే ష్ , గంగాధర్, సాదికలి, శ్యామలాదేవి, ఎరుకలయ్య, ప్రసాద్, సాంబశివుడు, మధు రెడ్డి, అరుణ , మల్లిక బేగం, రసూల్ పాల్గొన్నారు.










