
ప్రజాశక్తి - భీమవరం
భీమవరం పీపీ రోడ్డులో ఫస్ట్ క్రై షోరూం ఏర్పాటైంది. ఆంధ్ర తెలంగాణలోని మొట్టమొదటి అతిపెద్ద షోరూం కావడం విశేషం. ఈ ఫస్ట్ క్రై షోరూంను ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్నపిల్లల కోసం ప్రత్యేకించి ఫస్ట్ క్రై డాట్ కామ్ షోరూమ్‌ను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం నిర్వాహకులు తాడికొండ అవినాష్ తాడికొండ జయశ్రీ మాట్లాడుతూ తమ షోరూమ్‌లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు అన్ని రకాల దుస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.