Nov 13,2023 20:51

ప్రజాశక్తి - భీమవరంరూరల్‌
భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐగా హనుమంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రజలకు విశిష్ట సేవలందించి, ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించాలని అప్పుడే ప్రజల్లోనూ, ప్రభుత్వంలోనూ మంచి పేరు ఉంటుందని అన్నారు.