
భీమవరంరూరల్:పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. విస్సాకోడేరు జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు అత్యంత నాణ్యతగా, వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం గుర్తించి భీమవరానికి గృహ నిర్మాణ పరంగా అవార్డు, ప్రశంసా పత్రం ఇవ్వడం అభినందనీయమని, లబ్ధిదారుల కోరిక మేరకు గృహ నిర్మాణాలు చేస్తున్న పళ్ల ఏసుబాబును ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు.