Aug 26,2023 23:51

భూముల రీ సర్వే పరికరాలను పరిశీలిస్తున్న పార్లమెంటరీ బృందం సభ్యులు కనిమొళి తదితరులు

ప్రజాశక్తి- పద్మనాభం, ఆనందపురం : పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో పార్లమెంటరీ బృందం చైర్మన్‌ కరుణానిధి కనుమోజి ఆధ్వర్యాన శనివారం పర్యటించింది. రెడ్డిపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ప్రజలకు అందుతున్న సేవలపై సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్వాక్రా మహిళలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రెండు గ్రూపులకు చెందిన ఇద్దరు మహిళలు వారి అనుభవాన్ని సభలో వివరించారు. ఈ కార్యక్రమానికి ముందు రెడ్డిపల్లిలో 2.5 ఎకరాల్లో పండించిన సపోటా తోటను పరిశీలించారు. ఎంపిపి రాంబాబు, జెడ్‌పిటిసి సభ్యులు ఎస్‌.గిరిబాబు. ఎంపిడిఒ విజరుకుమార్‌, తహశీల్దార్‌ శ్రీవల్లి, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
ఆనందపురం : ఆనందపురం మండలంలో 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ శనివారం అభివృద్ధి పనులను పరిశీలించింది. శోంఠ్యాం గ్రామ పంచాయతీ పరిధి రామ్‌సాగర్‌, అమృత సరోవర్‌ ట్యాంకులను పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందక గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జగ్గురాజుపాలెం వద్ద భూముల రీ సర్వేకు సంబంధించిన డ్రోన్లు, పరికరాలు, ల్యాండింగ్‌ స్కెచ్‌లు, ఎగ్జిబిషన్‌లో ఉన్న పరికరాలను పరిశీలించారు. పిఎంజిఎస్‌వై రోడ్లును పరిశీలించారు. రైతులకు వ్యవసాయ రుణాలు, వివిధ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్వే శాఖ ఏడీ కె.సూర్యారావు, ఎస్‌ఇ బిఎస్‌.రవీంద్ర, పీడీ డిడబ్ల్యుఎమ్‌ ఎ.సందీప్‌, భీమిలి ఆర్‌డిఒ భాస్కరరెడ్డి, మండల పరిపాలనాధికారి అడపా లవరాజు, తహశీల్దార్‌ లోకవరపు రామారావు పాల్గొన్నారు.