Oct 07,2023 01:23

ప్రజాశక్తి - అద్దంకి
భీమా రంగంపై జిఎస్‌టి రద్దు చేయాలని కోరుతూ ఈనెల 9న జరుగనున్న ఆందోళనపై స్థానిక ఎల్‌ఐసి బ్రాంచి వద్ద గోడపత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. జోనల్ ఆఫీస్ వద్ద ఈనెల 9న ఎల్ఐసి ఏజెంట్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు తీసుకురావాలని జరిగే ధర్నాలో ఏజెంట్లు పాల్గొనాలని ఎల్‌ఐసి ఎఒఐ నెల్లూరు డివిజన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి వెంకట్రావు కోరారు. ఎల్ఐసి ఏజెంట్లకు గ్రాడ్యుటి పెంచాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లపై చలో జోనల్ ఆఫీస్ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు అర్ రామకోటిరెడ్డి, బ్రాంచి నాయకులు బి హనుమంతరావు, షేక్ కాలేబాషా, ఐసిఈయు బ్రాంచి సెక్రటరీ టి సత్యనారాయణ, నాయకులు రవికుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.