
పెదనందిపాడు: భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక శ్రీ నారాయణ స్కూల్ విద్యార్థులతో కలిసి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిచారు. ఎస్‌ఎ ఫ్‌ఐ మండల కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ భగత సింగ్ ని స్ఫూర్తిగా తీసుకుని విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పెదనందిపాడు మండల అధ్యక్షుడు అర్జున్, నాయకులు రాజేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు.