
ప్రజాశక్తి - గుడివాడ : భారతదేశ ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్, విశ్వకవి సామ్రాట్ గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా ఎస్‌ఎఫ్‌ఐ గుడివాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎస్ .పి. ఎస్ స్కూల్ నందు సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్‌పిఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రాణి భగత్‌సింగ్, జాషువా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ గుడివాడ పట్టణ కార్యదర్శి ఎస్ . సమీర్, రాజు, నవీన్, గణేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.