ప్రజాశక్తి -పాడేరు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణాలర్పించిన భగత్ సింగ్ జయంతిని దేశంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎస్‌ఎఫ్‌ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి కె.ప్రభుదాస్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులను ఎదురించి, పోరాడి ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ చరిత్రను కర్ణాటకలో పాఠ్యాంశాల నుంచి తొలగించడం దేశానికే చాలా అవమానకరమని విమర్శించారు. బిజెపి ప్రభుత్వానికి నిజమైన దేశభక్తి ఉంటే భగత్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె నర్సయ్య ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి పాపారావు వరహాలు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు










