Mar 23,2023 21:18

ప్రజాశక్తి - ఏలూరు
        భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులని, దేశంలో మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా దేశ లౌకికతత్వాన్ని నిలబెట్టిన గొప్ప మార్క్సిస్టు వాది హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ అని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి కొనియాడారు. స్థానిక పవర్‌పేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్థంతి, సిపిఎం జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ జయంతి సభను ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సూర్జిత్‌ చిత్ర పఠానికి ఎ.రవి, ఆ తర్వాత భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ చిత్ర పటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గుడిపాటి నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులు చిత్రపటాల ముందు పూవ్వులు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ భగత్‌ సింగ్‌ యుక్త వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప దేశభక్తుడు అని కొనియాడారు. భగత్‌ సింగ్‌, తన తోటి విప్లవ సహచరులు రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ మతతత్వ శక్తులు అధికారంలోకి రాకుండా దేశంలోని లౌకిక తత్వ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలో దేశ ప్రజలకు తెలియచేసి, స్వాతంత్య్ర సమరయోధులుగా, రైతు, వ్యవసాయ కార్మిక నేతగా పని చేసిన నాయకుడు సూర్జిత్‌ అని తెలిపారు. 23వ ఏటనే తన ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిన భగత్‌ సింగ్‌ చివరి కాలంలో అత్యంత పరిణితి చెందిన మార్క్సిస్టుగా ఆయన వ్యవహరించారన్నారు. చనిపోయే ముందు లెనిన్‌ జీవిత చరిత్రకు చెందిన 'మనం ఏమి చేయాలి' అనే పుస్తకాన్ని చదివి ఈ దేశానికి ఇదే మేలుకొలుపుగా ఉంటుందని భావించారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్‌, ఎ.శ్యామలారాణి, ఏలూరు నగర నాయకులు రామాంజనేయులు, జగన్నాధరావు, కోటేశ్వరరావు, గోపి, సత్యం, విద్యార్థి సంఘం నాయకులు లెనిన్‌ పాల్గొన్నారు.
ఏలూరు టౌన్‌ : భగత్‌ సింగ్‌ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలు కొనసాగించాలని కోరుతూ పిడిఎస్‌యు ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌ వర్థంతి సభను స్థానిక కొత్త బస్టాండ్‌ సమీపంలోని ఐటిఐ(డిఎల్‌టిసి)లో నిర్వహించారు. ముందుగా భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కాకినాని పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎం.క్రాంతి, పిడిఎస్‌యు నాయకులు సిహెచ్‌.యుగంధర్‌, ఎస్‌.సాయి, ఎస్‌కె.ఆబీబు, కళాశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ఆశయసాధనకు యువత కృషి చేయాలని వికాస్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ వి.జగన్‌ తెలిపారు. డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వికాస్‌ విద్యాసంస్థల ప్రాంగణంలో వర్థంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి బి.యశ్వంత్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి ఎస్‌కె.మాబుసుభాని, పి.మణి, గోపి, వెంకటరాజు, రాజేష్‌ ప్రిన్సిపల్‌ కిషోర్‌, సురేష్‌ పాల్గొన్నారు.
టి.నరసాపురం : అల్లూరి సీతారామరాజు నగర్‌ (కృష్ణాపురం మెట్ట) కాలనీలో సిపిఎం ప్రత్యేక గ్రామ పంచాయతీ పోరాటసమితి ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రత్యేక గ్రామ పంచాయతి పోరాటసమితి ఆధ్వర్యంలో టి.నరసాపురం పంచాయతీలోని ఏడు గ్రామాలను ప్రత్యేకగ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ పోరాటానికి సిపిఎం మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్యా వేణు, అనుమోలు మురళీకృష్ణ, కుంజా కిరణ్‌, మడకం సుబ్బాయమ్మ, షేక్‌ అమీనా, మడకం కుమారి, వగ్గాల లక్ష్మి, పెట్ల మంగ, తాటి బూషమ్మ, పండు వీరభధ్రుడు పాల్గొన్నారు.
వేలేరుపాడు : భగత్‌ సింగ్‌, సుకదేవ్‌, రాజ్‌గురు వర్థంతి సభను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తూరు, సుందరయ్యనగర్‌లో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎపి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మడివి దుర్గారావు మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కారం వెంకట్రావు, పూసం రాంబాబు, పాయం సత్యం, చంద్రరావు, బుచ్చయ్య, పరమేష్‌, ప్రకాష్‌, నాగు, నాగేంద్రబాబు ఉన్నారు.
జీలుగుమిల్లి : భగత్‌ సింగ్‌ వారసులుగా దేశంలో మతోన్మాద శక్తులను కార్పొరేట్‌ శక్తులను తిప్పికొట్టేందుకు నేటి యువత ప్రజాపోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ వర్థంతి సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు నల్ల భీమశంకరం, కె.సూర్య కుమారి, నాయకులు గజ్జల వెంకన్నబాబు, పసుపులేటి శ్రీను, అక్బర్‌, సీత, కరుణ, రమణ పాల్గొన్నారు.
ఉంగుటూరు : నారాయణపురంలో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రవికుమార్‌, పివి.నరసింహారావు, గౌరవ అధ్యక్షులు శీతాల సత్యనారాయణ, ఉంగుటూరు ప్రధాన కార్యదర్శి డాకి జోగినాయుడు, జిల్లా కార్యదర్శులు శ్రీధర్‌, కమల్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు తులసీలక్ష్మీ, ఉపాధ్యక్షులు హరికృష్ణ, వాణి, మండల అధ్యక్షులు వునుముల రాంబాబు, సీనియర్‌ నాయకులు, యుటిఎఫ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిడమర్రు : భగత్‌ సింగ్‌ వర్థంతి సభ భువనపల్లి బస్టాండ్‌ ఆవరణలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ చిత్రపటాలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కోన శ్రీనివాసరావు, వరప్రసాద్‌, లావేటి చంద్రరావు, బాపిరాజు, సూరిబాబు, పగడం మణికంఠ పాల్గొన్నారు.
ఏలూరు : స్థానిక గాంధీనగర్‌ మున్సిపల్‌ హై స్కూల్లో భగత్‌ సింగ్‌ వర్థంతి సభ నిర్వహించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌ చిత్రపటాలకు హై స్కూల్‌ హెచ్‌ఎం పూలమాల వేసి నివాళలుర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ మాట్లాడుతూ భగత్‌ సింగ్‌ పోరాటపటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మున్సిపల్‌ హై స్కూల్‌ ఉపాధ్యాయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
చింతలపూడి : భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ని స్ఫూర్తిగా తీసుకుని మతోన్మాద పాలకపక్షాల ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఎఐవైఎఫ్‌ మండల కార్యదర్శి టి.రాజు అన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్థంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద నుంచి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, పద్మ, ఎస్‌కె.జానీ, ఎఐటియుసి ఏరియా అధ్యక్షులు తొర్లపాటి బాబు, ఎఐవైఎఫ్‌ నాయకులు వడ్డే రామారావు, బత్తుల రఘు, బొంతు నవీన్‌, విజరు, శేఖర్‌, వంశీ, అంబేద్కర్‌, ముఠాకార్మికులు నాగేశ్వరావు, అప్పారావు, కె.వీరయ్య, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు
నూజివీడు : భగత్‌ సింగ్‌ వర్థంతిని సిపిఎం ఆధ్వర్యంలో పట్టణంలోని 10, 15 వార్డులో నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు, పట్టణ కార్యదర్శి ఎన్‌ఆర్‌.హనుమాన్లు, నాయకులు నాగరాజు, ఆంజనేయులు, జిలాని, ఏసుదాస్‌, నాగమల్లేశ్వరరావు, నాగేంద్ర పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : భగత్‌ సింగ్‌ ఆశయాలు నేటి యువత నెరవేర్చాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు పి.సూర్యారావు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో భగత్‌ సింగ్‌ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాగడాలతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎస్‌కె.సుభాషిణి, వంగా గోపి, జీవరత్నం, బొడ్డు రాంబాబు, మాబు సుభాని, అందుగుల ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.