
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : రక్తదానం ప్రాణ దానంతో సమానమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) మాజీ నాయకులు ఎ.లకీëశ్వరరెడ్డి, ప్రభుత్వ విశ్రాంత వైద్యులు పామరాజు వెంకటేశ్వర్లు అన్నారు. భగత్ సింగ్ 116 వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సిఐటియు కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పల్నాడు బ్లడ్ సెంటర్ పర్యవేక్షణలో గురువారం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని డాక్టర్ వెంకటేశ్వర్లు, లకీëశ్వరరెడ్డి ప్రారంభించగా శిబిరానికి విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు హాజరై రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్లు, లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ భగత్‌సింగ్ చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం పోరాడని, భగత్ సింగ్ ఆశయల సాధన కోసం నేటి యువత కృషి చేయాలని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం నాడు బ్రిటిష్ వారిని గడగడలాడించిన భగత్‌సింగ్... తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలను ఫణంగా పెట్టిన గొప్పవీరుడన్నారు. భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని ఇప్పుడున్న పాలకులు బడా పెట్టుబడిదారి సంస్థలకు, పెత్తందారులకు, విదేశీ గుత్త సంస్థలకు కట్టబెడుతున్నారని, విద్యారంగాన్ని పేదలకు దూరం చేస్తూ, విద్యను కార్పొరేటీకరిస్తున్నారని విమర్శించారు. విద్యను కాషాయికీరిస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా, యువతకు ఉపాధి కల్పించకుండా వారు పెఢదారిన వెళ్లేందుకు ప్రభుత్వాలు కారణమవుతున్నాయని అన్నారు. యువశక్తిని ఉపయోగించుకుంటనే దేశం అభివృద్ధి సాధిస్తుందనే విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు సిలార్ మసూద్, ఎస్‌కె.జిలాని మాలిక్, ఆంజనేయరాజు, జె.రాజ్ కుమార్, సిద్ధు, ఎం.ఆంజనేయులు, షేక్ సుభాని, జి.రాజేష్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని భగత్‌సింగ్ విగ్రహానికి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి. అర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ ఆదిశేషు మాట్లాడుతూ విప్లవ మార్గం ద్వారా దేశానికి స్వాతంత్య్రం సాధించాలనే విశ్వాతంతో 23 ఏళ్ల వయసులోనే భగత్‌సింగ్ పోరాడారని, ఆ క్రమంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారని చెప్పారు. అందరూ సమానంగా జీవించాలని భగత్‌సింగ్ కలలుగన్న సమాజం నేడు భారతదేశంలో లేదని, ప్రజలు మధ్య పాలకులు అనే విభేదాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేరుతో భారతదేశంలో విదేశీ విద్యాసంస్థల ఆహ్వానించడంతోపాటు విదేశీ వస్తువుల విదేశీ చదువులను ప్రోత్సహి స్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉందని, భగత్ సింగ్ ఆశయ బాటలో నడవడం అంటే విద్యారంగంలో ప్రమాదకర మార్పులను తిప్పికొ ట్టేందుకు పోరాడడమే అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు వందన, ఉదరు కిరణ్, సుష్మా, కోటేశ్వరరావు, చెన్నకేశవ, సిరి, భాగ్య, శ్యామ్ కిరణ్, బాలాజీ, ఉమాశంకర్, దుర్గాప్రసాద్, అనూష, భార్గవి, రాముడు, అజరు పాల్గొన్నారు
ప్రజాశక్తి - ఫిరంగిపురం : మండల కేంద్రమైన ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాలలో భగత్‌సింగ్ జయంతి నిర్వహించారు. చిత్రపటానికి ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి కె.పవన్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ ప్రశాంతి, నాయకులు యశ్వంత్, షరీఫ్, షఫీ, ప్రతాప్, అఖిల్ పూలమాలలేసి నివాళులర్పించారు. పవన్ కుమార్ మాట్లా డుతూ భగత్‌సింగ్ ఆశయ సాధనకు విద్యా ర్థులు, యువత పునరంకితం కావాలన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం వద్ద ఉన్న భగత్‌సింగ్ విగ్రహానికి ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. జె.నవీన్, ఎ.హనొక్ బాబు, డి.అజరు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్ ఆద్యంతం చైతన్యపూరితమని అవగాహన సభ్యులు పేర్కొన్నారు. నిరాశ, నిస్పృహల్లో కూరుకున్న వారు భగత్‌సింగ్ చరిత్ర చదివితే సమాజం పట్ల బాధ్యతను తెలుసుకొని చైతన్యవంతులవుతారని అన్నారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో భగత్‌సింగ్ జయంతిని పురస్కరించుకొని సంస్థ సభ్యులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఏపీ లీగల్ పోరం కన్వీనర్ ఎ.హరి, విద్యావేత్త ఆర్.వి.సింగ రయ్య, సీనియర్ సిటిజెన్స్ నాయకులు ఆర్.వెంకటరత్నం, అంకమ్మరావు, అవగాహన కార్యదర్శి కొండాశివరామిరెడ్డి పాల్గొన్నారు.