భగత్‌సింగ్ ఆశయ సాధనకు పోరాడాలి
- భగత్ సింగ్ లైబ్రరీ ట్రస్టు చైర్మన్ బి.శంకరయ్య
ప్రజాశక్తి - నంద్యాల
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉరికంబం ఎక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు నేటి యువతకు ఆదర్శనీయమని, ఆయన ఆశయ సాధనకు యువత ఉద్యమల్లోకి రావాలని భగత్‌సింగ్ లైబ్రరీ ట్రస్టు చైర్మన్ శంకరయ్య, ట్రస్ట్ సభ్యులు డాక్టర్ నాగరాజు, తోట మద్దులు పేర్కొన్నారు. జాతీయ స్వాతంత్రోద్యమ యువ విప్లవ కెరటం భగత్ సింగ్ 92వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక సాయిబాబా నగర్‌లోని భగత్ సింగ్ లైబ్రరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహనికి తోట మద్దులు, మాదాల శ్రీనివాసులు, సుఖదేవ్ విగ్రహానికి డాక్టర్ నాగరాజు, రాజ్‌గురు విగ్రహానికి డాక్టర్ రామకృష్ణ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు మరణించి నేటికి 92 సంవత్సరాలు అయినా వారి అమరత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నేటి యువత , విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ యువత ఉద్యమించాలని అన్నారు. అనంతరం ప్రజా గాయకులు చిన్న బాలహుస్సేని, వీరసేన, రమణలు భగత్ సింగ్‌పై పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జివి రమణ, నారాయణ, రైతు నాయకులు సురేష్, లాయర్ పుణీత్, భాస్కర్, రామామూర్తి, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో పట్టణంలోని పిడిఎస్‌యు కార్యాలయంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రాంబాబు, డివిజన్ ప్రధాన కార్యదర్శి శివశంకర్, నాయకులు సతీష్, మాబు, హుస్సేన్, సుబ్బారెడ్డి, సంతోష్, విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల కలెక్టరేట్ : నేటి యువతకు భగత్ సింగ్ జీవితం స్ఫూర్తిదాయకమని సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. గురువారం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌ల 92వ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ చౌక్ సెంటర్లో భగత్ సింగ్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి వెంకట లింగం అధ్యక్షత వహించారు. ప్రతి యువకుడు భగత్ సింగ్‌ను స్పూర్తిగా తీసుకుని చైతన్యం కావాలని చేయాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, నాయకులు సుబ్బారావు, రానా, నరసింహ, ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల అర్బన్ : నంద్యాల పట్టణంలోని భగత్ సింగ్ గ్రంథాలయం దగ్గర భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 92వ వర్ధంతి సందర్భంగా గురువారం వారి విగ్రహాలకు డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి శివ, నాయకులు పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు వినీత్, సంజరు, దివాకర్, రమణ, శ్రీరాములు, హర్ష, రాజశేఖర్, గోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎస్‌సి కాలేజీ బార్సు హాస్టల్‌లో నివాళ్లులర్పించారు. ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ధనుంజయుడు, జిల్లా సహాయ కార్యదర్శి పి.ఎర్రిస్వామి, ఎఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై యువత ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రైవేట్ పాఠశాలల నంద్యాల డివిజన్ అధ్యక్షులు అమీర్ బాషా అన్నారు. పట్టణంలోని విజ్ఞాన భారతి హైస్కూల్‌లో కరస్పాండెంట్ శివకుమార్,ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు. పాణ్యం: భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల పోరాట స్ఫూర్తితో భారతదేశంలో కార్పొరేటీకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా మరో స్వాతంత్ర పోరాటం చేద్దామని సిఐటియు మండల కార్యదర్శి కె.భాస్కర్, విద్యార్థి సంఘం నాయకులు బత్తిని ప్రతాప్‌లు పేర్కొన్నారు. సిఐటియు కార్యాలయంలో భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. రమేష్, సంతోష్, గోవిందు, మాభాష, భోపాల్, రామచంద్రుడు, మాసుం, ఆటో, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.










