Sep 29,2023 22:38

ప్రజాశక్తి - కొల్లూరు
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు విద్యా ఉపాధి కోసం పోరాడాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా అధ్యక్షులు పి మనోజ్ కోరారు. స్థానిక జివిఎస్ఆర్ అండ్ ఎఎస్ఆర్ జూనియర్ కళాశాల, బిఆర్‌కె మెమోరియల్ ఐటిఐ కళాశాలలో భగత్ సింగ్ 116వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి జి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో అగ్రగామి నాయకుల్లో భగత్ సింగ్ ఒకరని అన్నారు. అతి చిన్న వయసులోనే దేశ రక్షణ కోసం పోరాడి బ్రిటీష్‌ పాలకులను గడ గడలాడించిన విప్లవ తేజం భగత్ సింగ్ అని అన్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం, దోపిడీకి వ్యతిరేక పోరాడిన వీరుడని కొనియాడారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ నేటికీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దివ్య, భాగ్యశ్రీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొనిగల సుబ్బారావు పాల్గొన్నారు.