Mar 24,2023 00:01

ఆరిలోవలో మాట్లాడుతున్న ఆర్‌కెఎస్‌వి.కుమార్‌

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడాలని వక్తలు పిలుపునిచ్చారు. భగత్‌సింగ్‌ వర్థంతిని గురువారం జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆరిలోవ : ఆరిలోవ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వద్ద ఉన్న సాయి భగత్‌ సింగ్‌ ఆటో స్టాండ్‌ డ్రైవర్స్‌ ఆధ్వర్యాన భగత్‌సింగ్‌ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలను ఫణంగా పెట్టిన భగత్‌సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ పోరాట స్ఫూర్తితో హక్కుల కోసం కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పొరేట్లు పరం చేస్తుందన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం పినాకిల్‌ హాస్పిటల్స్‌ సెంటర్‌లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటోస్టాండ్‌ అధ్యక్ష కార్యదర్శులు శ్రీను, రమణ, ఆరిలోవ సిఐటియు కార్యదర్శి వి.నరేంద్రకుమార్‌, నాయకులు ఎన్‌.రాజేష్‌, సతీష్‌, భాస్కర్‌, రాము, నాయుడు, రమేష్‌, 40 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.
గాజువాక : గాజువాక పరిధి శ్రీనగర్‌, సుందరయ్య కాలనీ, దశమకొండ, అక్కిరెడ్డిపాలెంలో భగత్‌సింగ్‌ చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మాజీ నాయకులు ఎం.రాంబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
జివిఎంసి 67వ వార్డు పరిధి సాయిరాంనగర్‌లోని స్వామి విద్యానికేతన్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ పాలూరు లక్ష్మణస్వామి ఆధ్వర్యాన భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాంబాబు, కుమార్‌, యువకులు పాల్గొన్నారు.
తగరపువలస : భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ వర్థంతిని సిపిఐ, ఎఐటియుసి ఆధ్వర్యాన స్థానిక జిఆర్‌ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, సామాజిక వేత్త ఎస్‌.రాంప్రసాద్‌, నాయకులు అల్లు బాబూరావు, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొండపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక సిఐటియు కార్యాలయంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ దేవ్‌లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, రవ్వ నరసింగరావు, ఎస్‌.అప్పలనాయుడు, డి.బాబాజీ, ఎస్‌.శ్రీనివాసవర్మ, సోమి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.
భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో భగత్‌ సింగ్‌ వర్థంతిని నిర్వహించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ దేవ్‌లను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ యు.మాణిక్యంనాయుడు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ములగాడ : మల్కాపురం గ్రామ మండలి వద్ద ఎఐవైఎఫ్‌, సిపిఐ ఆధ్వర్యాన భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఎఐవైఎఫ్‌ నాయకులు గుడాల రాంబాబు, డొక్కాడ తిరుపతిరావు, కె.శంకరరావు, జి.రామకృష్ణ, వై.కనకరాజు, వి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
డివైఎఫ్‌ఐ మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన 59వ వార్డు నెహ్రునగర్‌లో భగత్‌సింగ్‌ చిత్రపటాలకు డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్‌ఎన్‌.రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. 63వ వార్డు క్రాంతినగర్‌లో డాక్టర్‌ ప్రియాంక, 62వ వార్డు దుర్గానగర్‌లో ఎల్‌జె.నాయుడు, చింతల్లోవలో డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మల్కాపురం జోన్‌ అధ్యక్షులు బూడి శ్రీను, ఎస్‌.వాసు, రామకృష్ణ, నాని, యు.రాజు, సురేష్‌, డి.రాజేష్‌, ప్రశాంత్‌, జె.మోహన్‌, వెంకటేష్‌, నవీన్‌, బి.హరి, ఎస్‌.రాజు, విష్ణు, రామకృష్ణ, నరేష్‌, గణేష్‌, అర్జునరావు, మహేంద్ర, ఎల్‌.కృష్ణ,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మధురవాడ : భగత్‌సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవ్‌ వర్థంతి సందర్భంగా సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఐద్వా, విసిసి ఆధ్వర్యాన కొమ్మాది కూడలి నుంచి మధురవాడ మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కాగాడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.అప్పలరాజు, డి.కొండమ్మ, ఐద్వా నాయకులు బి.భారతి, కె.సుజాత, విసిసి కార్యకర్తలు పి.రామరాజు, ఎస్‌.బద్రి, డివైఎఫ్‌ఐ నాయకులు డి.ఉమశైలజ, బి.ఉష, నరేంద్ర, జి.కిరణ్‌, సిహెచ్‌ శేషు, ఎస్‌ రామప్పడు తదితరులు పాల్గొన్నారు.