Sep 27,2023 22:14

భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఎం శ్రీనివాస పూలమాల వేసి నివాళుల ర్పించారు.

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  భగత్‌ సింగ్‌ స్ఫూర్తితో నిర్బంధాలను ప్రతిఘటిస్తామని సిఐటియుజిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస అన్నారు. భగత్‌సింగ్‌ 116వ జయంతి సిఐటియు ఆధ్వర్యాన బుధవారం ఎల్‌బిజి భవనంలో ఘనంగా నిర్వహించారు. తొలుత భగత్‌సింగ్‌ చిత్రపటానికి ఎం శ్రీనివాస పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం మాట్లాడుతూ 23ఏళ్ల అతి చిన్న వయసులో దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను భగత్‌ సింగ్‌ సుఖదేవ్‌ ,రాజ్‌గురు త్యాగం చేశారని అన్నారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.జగన్మోహన్‌, బి.రమణ, కె.త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం సభ్యులు బుచ్చయ్య అధ్యక్షతన ముచ్చి వాని చెరువుగట్టు వద్ద భగత్‌ సింగ్‌ జయంతి ఘనంగా జరిగింది. ముందుగా భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు ఎ.జగన్మోహన్‌ రావు మాట్లాడుతూ నాడు బ్రిటీష్‌ తొత్తులుగా మారిన ఆర్‌ఎస్‌ఎస్‌, నేడు అధికారాన్ని చేపట్టి దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్మేస్తుందని అన్నారు. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిందన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, వామపక్షాలు పోరాడు తున్నాయన్నారు. అందులో భాగంగా అక్టోబర్‌ 5న కూర్మన్నపాలెంలో జరిగే ముగింపు సభకు ప్రజలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాము, రామకృష్ణ, భాస్కర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.