Apr 27,2023 23:23

భగీరథ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ఎంపి గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎంఎల్‌ఎలు కన్నబాబు, ద్వారంపూడి

ప్రజాశక్తి - కాకినాడ
పవిత్ర గంగను దివి నుంచి భువికి తీసుకొచ్చిన మహర్షి భగీరథుని సంకల్ప బలం, పట్టుదల ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, మహర్షి భగీరథుని దీక్షా దక్షతను ఎంపి, కలెక్టరు, ఎంఎల్‌ఎలు స్మరించుకున్నారు. మహర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాకినాడ నగరం 9వ డివిజన్లోని గుడారిగుంట, సగరుల రామాలయం వద్ద ఉన్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి కాకినాడ ఎంపి వంగాగీత, జిల్లా కలెక్టర్‌ కతికా శుక్లా, కాకినాడ రూరల్‌, సిటీ ఎంఎల్‌ఎలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కుడా చైర్‌ పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్న, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సగర సంఘ ప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి పి.సత్యరమేష్‌, బిసి కార్పొరేషన్‌ ఇడి ఎస్‌.వి.ఎస్‌.సుబ్బలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంగం అధ్యక్షులు కటారి త్రిమూర్తులు, సగర సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దాపురం శాఖా గ్రంధాలయంలో గ్రంథాలయ అధికారి పాలంకి నాగరాజు, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బొడ్డు తులసి మంగతాయారు, వైస్‌ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్‌,కనకాల మహాలక్ష్మి ల ఆధ్వర్యంలో, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి పెంకే సత్యవతి, జడ్‌పిటిసి గవరసాన సూరిబాబుల ఆధ్వర్యంలో భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె సురేంద్ర,ఎండిఓ కార్యాలయం ఏవో వి శ్రీనివాస్‌,వైస్‌ ఎంపిపి మిరియాల రాజా, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు పాఠకులు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒ డి శ్రీలలిత, ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు ఎంపిడిఒ కార్యాలయం ఎఒ విప్పర్తి వీర సాయిబాబు, ఇన్‌చార్జి ఇఒపిఆర్‌డి కె శ్రీహరి, ఎంపిడిఒ కార్యాలయం సిబ్బంది, ఉద్యోగులు భగిరధుని చిత్రపటానికి నివాళులర్పించారు.