Jun 13,2023 19:30

సమావేశంలో మాట్లాడుతున్న చింతల మోహన్‌ రావు

భగ్గుమంటున్న కరెంటు బిల్లులు
ఎపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల మోహన్‌ రావు
ప్రజాశక్తి - నంద్యాల

      రాష్ట్రంలో గత మూడు నెలల నుండి పేద ప్రజల జీవితాల్లో వేసవికాలంతో పాటు కరెంటు బిల్లు ఛార్జీలు భగభగ మండుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చింతల మోహన్‌ రావు, సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌ విమర్శించారు. మంగళవారం నంద్యాలలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్‌ శాఖ వారు గత రెండు మూడు నెలల నుండి కరెంటు బిల్లులో అనవసరమైన ఆదనపు చార్జీలు పేద ప్రజలపై మోపుతున్నారని అన్నారు. పేదలు కరెంట్‌ బిల్లులు చెల్లించలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఒక పక్క నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోయి పేద మధ్యతరగతి ప్రజలు జీవితాలు గడుపుకోలేకపోతున్న సందర్భంలో వేల రూపాయల కరెంటు బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎపిలో ఆదనపు చార్జీలు మోపడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆదనపు చార్జీలు మోపకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ కరాటి బాలకృష్ణ, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి శంశుల్‌ హక్‌, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు పసుపుల అజరు కుమార్‌, భాష నరసింహులు తదితరులు పాల్గొన్నారు.